శివసేన మా మిత్ర పక్షమే..ఇద్దరి సిద్ధాంతాలు ఒకటే

ఉద్ధవ్‌ ఠాక్రే కోరితే వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు బిజెపి మద్ధతు ఇస్తుంది

sudhir mungantiwar
sudhir mungantiwar

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కోరితే వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బిజెపి సిద్ధంగా ఉందని మాజీ మంత్రి బిజెపి సీనియర్‌ నాయకుడు సుధీర్‌ మునగంటివార్‌ అన్నారు. శుక్రవారం నాందేడ్‌ పర్యటనలో ఉన్న ఆయన రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ శివసేన తమ మిత్రపక్షమేనని ఇద్దరి సిద్ధాంతాలూ ఒకటేనన్నారు. శివసేన నుంచి ప్రస్తావన వచ్చినట్టయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ పేర్కొనట్టుగానే బిజెపిని అధికారం నుంచి దూరం చేసేందుకు కాంగ్రెస్‌ శివసేనకు మద్దతు పలికిందని విమర్శించారు. అయితే దీనివల్ల శక్తివంతమైన ముంబైలోని మాతోశ్రీ ప్రాబల్యం కొంతమేర తగ్గిందని మరోవైపు ఢిల్లీలో మాతోశ్రీ బలం పెరిగిందంటూ సుధీర్‌ మునగంటివార్‌ శివసేనకు పరోక్ష విమర్శలు చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/