పవన్ కళ్యాణ్ ఫై వైస్సార్సీపీ నేతల మాటల దాడి

ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ ఫై వైస్సార్సీపీ నేతలు మాటల దాడి మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకు తప్ప మరెప్పుడు మీడియా ముందుకు రారని అంత మాట్లాడుకుంటుండగా..మళ్లీ అదే చేస్తున్నారు. నిన్న శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన యువశక్తి సభలో పవన్ కళ్యాణ్..వైస్సార్సీపీ లోని కొంతమంది నేతలపై పలు కామెంట్స్ చేయడం తో..ఆ సభ పూర్తి అవ్వగానే ట్విట్టర్ లో వైస్సార్సీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక ఈరోజు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తున్నారు. మరి ఏ ఏ నేత ఎలా విమర్శించారో చూద్దాం.

రాష్ట్రాన్ని నిలువునా దోచుకోవడమే చంద్రబాబు, లోకేష్‌, దత్తపుత్రుడి ఎజెండా అని వైస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. చంద్రబాబుకు పదవి పిచ్చి, ప్యాకేజీ స్టార్‌కు డబ్బు పిచ్చి అని ఎద్దేవా చేశారు. పేదలవైపు జగనన్న ఉంటే.. అధర్మం వైపు చంద్రబాబు అండ్‌ కో ఉన్నారని తెలిపారు. చంద్రబాబు అండ్‌కోకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారు అని ఎంపీ మార్గాని భరత్‌ హెచ్చరించారు.

పవన్‌ కల్యాణ్ ఓ రాజ‌కీయ వ్య‌భిచారి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమ‌ర్శించారు. పవన్‌ స్పీచ్‌ ఆంబోతు రంకెలేసినట్టు ఉంది. పవన్‌ పార్టీకి ఓ విధానం గానీ ఎజెండా గానీ లేవు. పవన్‌ ఓ రాజకీయ వ్యభిచారి.కాపుల మీద పవన్‌కు పేటెంట్‌ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. పవన్‌లా సన్యాసి రాజకీయం చేసే కుటుంబం కాదు మాది. పవన్‌ నీల డబ్బుకు అమ్ముడుపోయే కుటుంబం కాదు మాది. జనసేన పేరు మార్చి చంద్రసేన పెట్టుకుంటే బెటర్‌.పవన్‌లో ప్రవహిస్తోంది కమ్మని పసుపు రక్తం. ప‌వన్‌కు ఉన్నవి నారా వారి నరాలు’ అని విమర్శించారు.

పవన్ కళ్యాణ్ ఓ ప‌గ‌టి వేష‌గాడ‌ని మంత్రి సిదిరి అప్పలరాజు విమ‌ర్శించారు. గ్రామాల్లో పండగల సమయంలో పగటి వేషగాళ్లు వస్తారని.. ఇప్పుడు పవన్ కూడా అలాగే వచ్చాడని ఎద్దేవా చేశారు. పవన్‌ది వ్యవహారం కాదు యవ్వారం. ఇది చాలా కాస్ట్‌లీ. వందల వేల కోట్లు తీసుకుని, పగటి వేషం వేసినట్లుంది అని అన్నారు. సీఎం జగన్‌ ను విమర్శించే అర్హత పవన్‌ కళ్యాణ్‌కు లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

అంబటి రాంబాబును సంబరాల రాంబాబు అని వ్యాఖ్యానించిన పవన్‌ కల్యాణ్‌కు స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు మంత్రి. ‘నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్‌వి’ అని అంబటి రాంబాబు ట్వీట్‌ చేశారు. పీకే అంటే పిచ్చి కుక్క అని, పవన్‌.. చంద్రబాబు జోకర్‌వి అని విమర్శించారు మంత్రి అంబటి. ఇక పవన్‌ వ్యాఖ్యలపై మంత్రి రోజా కూడా మండిపడ్డారు. రెండుసార్లు గెలిచిన తాను.. రెండుసార్లు ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా అంటూ ఘాటుగా స్పందించారు.