థియేటర్ ను ధ్వసం చేసిన మెగా ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్ధరాత్రి నుండే థియేటర్స్ వద్ద మెగా సందడి మొదలైంది. భారీ కటౌట్స్ , ప్లెక్సీ లు ఏర్పటు చేసి మెగా అభిమానాన్ని చాటుకున్నారు అభిమానులు. కాగా గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఓశ్రీలక్ష్మీ థియేటర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున బెనిఫిట్‌ షో చూసేందుకు థియేటర్‌ వద్దకు భారీగా అభిమానులు తరలి రాగా.. సాంకేతిక లోపంతో సినిమాని ప్రదర్శించలేకపోతున్నామని సిబ్బంది ప్రకటించింది. ఎంతోసేపు వేచి ఉన్నా సిబ్బంది నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వాళ్లు మరింత ఆగ్రహానికి లోనై థియేటర్‌ అద్దాలు పగలగొట్టారు. థియేటర్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. అభిమానులను అక్కడి నుంచి పంపించేశారు.

గాడ్ ఫాదర్ తో మెగా హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..వాల్తేర్ వీరయ్య గా ఈరోజు సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటించగా, రవితేజ కీలక పాత్రలో కనిపించాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుగా , మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సినిమాలో చిరంజీవి యాక్టింగ్ కేక అని , శృతి హాసన్ గ్లామర్ అదిరిపోయిందని , రవితేజ- చిరంజీవి ల మధ్య సన్నివేశాలు హైలైట్స్ గా ఉన్నాయని , ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందని అంటున్నారు. కాకపోతే రొటీన్ కథ – కథనం, కామెడీ వర్క్ అవుట్ కాకపోవడం కాస్త నిరాశ కలిపించిందని అంటున్నారు. ఓవరాల్ గా చిరంజీవి ఫ్యాన్స్‌కు పండగ లాంటి సినిమా. సంక్రాంతి పండగ సీజన్‌లో మంచి జోష్ నింపే చిత్రంగా వాల్తేరు వీరయ్య తెరకెక్కింది.