పవన్ ఫై ముద్రగడ పద్మనాభం పోటీ..?

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వైసీపీ అధినేత జగన్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఈసారి ఎలాగైనా 175 కు 175 సాధించాలని పట్టుదలతో ఉన్న జగన్..ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల అధినేతలను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కుప్పం లో బాబు ను , పవన్ ఎక్కడ నుండి పోటీ చేస్తే అక్కడ బలమైన నేతలు నిలబెట్టి ఓడించాలని చూస్తున్నారు. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు భీమవరం లేదా గాజువాక నుండి పోటీ చేస్తారనే వార్తలు వినిపించిన..ప్రస్తుతం ఆయన పిఠాపురం నుండి బరిలోకి దిగాలని చూస్తున్నాడట. ఇక్కడ కాపు ఓట్లు అధికంగా ఉండడం తో ఇక్కడి నుండే పోటీ చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాడట.

ఇదే క్రమంలో వైసీపీ ఇక్కడ ముద్రగడ పద్మనాభం ను పవన్ ఫై పోటీకి దించాలనే ఆలోచన చేస్తుందట. అయితే.. గతంలో ముద్రగడను జనసేనలో చేర్చుకునేందుకు మంతనాలు జరిగాయి. అదే సమయంలో.. టీడీపీ, వైసీపీ కూడా ఆయనను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. అయితే.. ఆయన మాత్రం వైసీపీలో చేరేది లేదని.. అవసరమైతే జనసేన, టీడీపీలో ఏదో ఒక పార్టీలో చేరతానంటూ సంచలన స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైందో మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే పవన్ ఫై ఆయనైతే బాగుంటుందని జగన్ ఆలోచన చేస్తున్నాడట.