ఢిల్లీలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

Electricity workers protest in Delhi

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్​లో బుధవారం ధర్నా నిర్వహించారు. బిజిలీ క్రాంతి యాత్ర పేరిట దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యుత్ ఉద్యోగులు జాయింట్ కమిటీగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. ఇందులో తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు హాజరయ్యారు. తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రత్నాకర్ రావు, సెక్రటరీ జనరల్ సదానందం, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం సెక్రటరీ జనరల్ ముత్యం వెంకన్న గౌడ్​తో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల రైతులతో పాటు, ప్రజలు, విద్యుత్ ఉద్యోగులు నష్టపోతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏండ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడాన్ని సహించేదిలేదన్నారు. ప్రైవేటీకరణకు ముందుకెళ్తే దేశమంతటా కరెంటు స్తంభింపచేస్తామని హెచ్చరించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు ఎంపీ ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే రైతులు, ప్రజలు నష్టపోతారని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/