195 మంది అభ్యర్థులతో బిజెపి తొలి జాబితా విడుదల

bjp

దేశంలో లోక్‌సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. జాతీయ పార్టీలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. 195 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును బీజేపీ రిలీజ్ చేయగా… వారణాసి నుంచి ప్రధాని మోడీ మరోసారి పోటీ చేయనున్నారు.

ఈ జాబితాలో 28 మంది మహిళలకు స్థానం కల్పించారు. తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పేర్లను ఖరారు చేసింది. గాంధీ నగర్ నుంచి అమిత్ షా పోటీ చేయనున్నారు. జాబితాలో 36 కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. 57 మంది ఓబీసీలకు చోటుదక్కింది. ఉత్తరప్రదేశ్‌లో 51, గుజరాత్ లో 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

వీరిలో.. మహిళలు – 28
యువకులు – 47
ఎస్సీ- 27,
ఎస్టీ -18

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం దేశంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాయి. భారత్‌ జోడో న్యాయ్ యాత్ర పేరుతో రాహుల్‌గాంధీ ఓ వైపు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తుండగా.. వివిధ రాష్ట్రాల్లో విజయ సంకల్ప యాత్రల పేరుతో బీజేపీ కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై దృష్టి సారించాయి.