టక్ జగదీష్ ట్రైలర్ టాక్ – కుటుంబాన్ని ప్రేమించే జగదీష్

నాని , రీతూ వర్మ జంటగా నిన్ను కోరి ఫేమ్ శివనిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ టక్ జగదీశ్. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భాంగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి నింపారు.

ట్రైలర్ విషయానికి వస్తే..

‘భూదేవిపురం గురించి మీకో కథ చెప్పాలి’ అంటూ వీరేంద్ర అనే విలన్ గా డేనియల్ బాలాజీ ని చూపించడంతో ఈ ట్రైలర్ మొదలైంది. జగదీష్ తండ్రిగా నాజర్ కనిపిస్తుండగా.. అన్న బోసుగా జగపతిబాబు నటించారు. నాని ప్రేయసి గుమ్మడి వరలక్ష్మిగా రీతూ వర్మ నటించగా.. మరదలి పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటుగా ఈ సినిమాలో యాక్షన్ కూడా కావాల్సినంత ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. భూకక్షలు లేని భూదేవి పురాన్ని చూడాలనే తన తండ్రి కోరికను నెరవేర్చే బాధ్యత తీసుకున్న జగదీష్.. విలన్స్ ఫైట్ చేయడాన్ని చూడొచ్చు.

‘అయినోళ్ళ కంటే ఆస్తులు పొలాలు ఎక్కువ కాదు.. రక్తసంబంధం విలువ తెలుసుకో’ వంటి డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఫ్యామిలీని ఎంతో ప్రేమించే జగదీష్ నాయుడు అనే యువకుడి కథే ఈ చిత్రమని తెలుస్తోంది.

ఈ సినిమాలో రీతు వ‌ర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి, తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌. త‌మ‌న్ సంగీతం అందించగా..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గోపిసుందర్ ఇచ్చారు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేసారు. ఇక మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.

YouTube video