వైసీపీ ఐదో జాబితా విడుదల

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ..అభ్యర్థుల విషయంలో కీలక మార్పులు చేస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న నేతలను పక్కకు పెట్టి కొత్త వారికీ..లేదా వేరొకరికి నియోజకవర్గ బాధ్యత ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే నాల్గు జాబితాల్లో కొత్త ఇంచార్జ్ లను ప్రకటించిన అధిష్టానం..బుధువారం ఇదో జాబితాను విడుదల చేసారు.

ఐదో జాబితాలో నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ, పార్ట రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంఛార్జీల మార్పులను ప్రకటించారు.

ఎంపీ ఇంఛార్జీలు చూస్తే..

కాకినాడ (ఎంపీ)- చలమలశెట్టి సునీల్‌
నర్సరావుపేట(ఎంపీ)-అనిల్‌కుమార్‌ యాదవ్‌
తిరుపతి (ఎంపీ)-గురుమూర్తి
మచిలీపట్నం (ఎంపీ)- సింహాద్రి రమేష్‌ బాబు

ఎమ్మెల్యే ఇంఛార్జీలు చూస్తే..

సత్యవేడు (ఎమ్మెల్యే) – నూకతోటి రాజేష్‌
అరకు వేలి (ఎమ్మెల్యే)- రేగం మత్స్యలింగం
అవనిగడ్డ (అసెంబ్లీ) – డా.సింహాద్రి చంద్రశేఖరరావు.