తెలంగాణలో ట్రాఫిక్‌ చలాన్ల రాయితీ గడువు పెంపు..ఎప్పటివరకు అంటే ..!!

తెలంగాణ సర్కార్ ..వాహనదారులకు గుడ్ న్యూస్ తెలిపారు. మరోసారి ట్రాఫిక్‌ చలాన్ల రాయితీ గడువును పెంచారు. ప్రస్తుతం గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 15 వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సర్కార్ డిసెంబర్‌ 26 నుంచి పెండింగ్‌ చలాన్లపై రాయితీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సాంకేతిక సమస్యల నేపథ్యంలో మరో 15 రోజుల పాటు గడువును పొడిగించింది.

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చలాన్లు 3.59 కోట్లు ఉండగా.. దాదాపు 1.50 కోట్ల చలాన్లకుపైగా చెల్లింపులు జరిగాయి. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీతో ప్రభుత్వానికి రూ.135 కోట్లకుపైగానే ఆదాయం సమకూరింది. టూ వీలర్స్‌, ఆటోల చలాన్లపై 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే.