దేశంలో 3,714 కొత్త‌గా క‌రోనా కేసులు

దేశంలో యాక్టివ్​ కేసులు.. 26,976

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్​ కేసులు మళ్లీ తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 3,714 మంది వైరస్​ బారినపడ్డారు. ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.72 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.06 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.21 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.97% గా వద్ద ఉంది. దేశంలో సోమవారం 13,96,169 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,94,27,16,543కు చేరింది. మరో 3,07,716 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

ప్రపంచదేశాల్లో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 3 లక్షల 27 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 754 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 535,815,964కు చేరింది. మరణాల సంఖ్య 6,321,428కు చేరింది. ఒక్కరోజే 473,310 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 506,777,660గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/