ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టు

భూ కుంభకోణం కేసులో దాదాపు 6 గంటల పాటు హేమంత్‌ సోరెన్‌ ను విచారించిన అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసారు. ఈడీ అధికారులు అరెస్టు చేయడానికి ముందే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు.

హేమంత్‌ సోరెన్‌ రాజీనామాకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో.. కొత్త సీఎంగా ఆయన సన్నిహితుడు చంపై సోరెన్‌ను ఎన్నుకున్నారు. JMM సీనియర్ నేత , రవాణా మంత్రి అయిన చంపై సోరేన్ కు మంచి పేరుంది. హేమంత్ సోరేన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు.