10 మిలియన్ ప్లస్ వ్యూస్ రాబట్టిన సుగుణ సాంగ్

వీరసింహరెడ్డి నుండి వచ్చిన సుగుణ సాంగ్..యూట్యూబ్ లో 10 మిలియన్ల వ్యూస్ రాబట్టి దూసుకెళ్తుంది. నందమూరి బాలకృష్ణ , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న మూవీ వీరసింహారెడ్డి. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా తాలూకా పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ఇలా అన్ని సినిమా ఫై అంచనాలు పెంచేయగా..రీసెంట్ గా సినిమాలోని రెండో సాంగ్ సుగుణ సుందరి.. అంటూ సాగే డ్యూయెట్ ను మేకర్స్ గురువారం విడుదల చేయగా..తాజాగా 10 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. దీనికి సంబదించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.

YouTube video