వైసీపీ మూడో లిస్ట్ విడుదల

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ నియోజకవర్గాల ఇంచార్జ్ లను మారుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు లిస్ట్ లను విడుదల చేయగా..గురువారం రాత్రి మూడో లిస్ట్ ను విడుదల చేసింది. మొత్తం 21 మంది తో కూడిన ఎంపీ , అసెంబ్లీ ఎమ్మెల్యే ఇంచార్జ్ లను రిలీజ్ చేసింది. దీనిలో 6 ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేసింది.

పార్లమెంటు ఇంఛార్జిలు
తిరుపతి.. కోనేటి ఆదిమూలం
కర్నూలు.. గుమ్మనూరు జయరాం
ఏలూరు… కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
శ్రీకాకుళం.. పేరాడ తిలక్
విశాఖపట్నం.. బొత్స ఝాన్సీ లక్ష్మి
విజయవాడ – కేశినేని నాని

అసెంబ్లీ ఇంఛార్జిలు
ఇచ్చాపురం.. పిరియ విజయ
టెక్కలి.. దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి(ఎస్సీ).. కంభం విజయ రాజు
చిత్తూరు.. విజయానంద రెడ్డి
మదనపల్లె.. నిస్సార్ అహ్మద్
రాయదుర్గం.. మెట్టు గోవిందరెడ్డి
దర్శి.. బూచేపల్లి శివప్రసాదరెడ్డి
పూతలపట్టు(ఎస్సీ).. మూతిరేవుల సునీల్ కుమార్
కోడుమూరు(ఎస్సీ).. డాక్టర్ సతీశ్
రాజంపేట.. ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
గూడూరు(ఎస్సీ).. మేరిగు మురళి
సత్యవేడు(ఎస్సీ).. మద్దిల గురుమూర్తి
పెనమలూరు – జోగి రమేశ్
పెడన – ఉప్పాల రాము
ఆలూరు – బూసినే విరూపాక్షి లను నియమించింది. ఇప్పటివరకు 38 స్థానాల్లో ఇంఛార్జిల మార్పులు చేశారు జగన్. మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేయగా.. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు. అయితే మొదటి జాబితాలో ఎక్కడా కూడా ఎంపీ స్థానాలు ప్రకటించ లేదు. రెండో జాబితాలో మాత్రం మూడు ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు. మూడో లిస్టులో 6 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. మొత్తంగా 59 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు పూర్తయ్యాయి.