హనుమాన్ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్

ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ కలయికలో తెరకెక్కిన హనుమాన్ మూవీ సంక్రాంతి కానుకగా ఈరోజు వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కానీ ఓ రోజు ముందే పలు చోట్ల ప్రీమియర్ షోస్ వేయడం తో సినిమా ఎలా ఉందనేది బయటకు వచ్చింది. సంక్రాంతి బరిలో మహేష్ గుంటూరు కారం తో నాగార్జున నా స్వామి రంగ, సైoదవ్ తో వస్తుండగా..ఏమాత్రం వెనుకడువేయకుండా సినిమా కథ ఫై నమ్మకంతో డైరెక్టర్ ప్రశాంత్ , నిర్మాత నిరంజన్ హనుమాన్ ను రిలీజ్ కు సిద్ధం చేసారు. ఓ పక్క ఈ చిత్రానికి పెద్దగా థియేటర్స్ లేనప్పటికీ..వారం తర్వాత అయినా థియేటర్స్ కు దొరుకుతాయని చెప్పి సినిమాను రిలీజ్ చేసారు. ఇక ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ , నిర్మాతలు ఎందుకు అంత నమ్మకం వ్యక్తం చేసారో చెప్పుకొస్తున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఓ అద్భుతం అని , హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉందని , ట్విస్ట్ లు , కామెడీ , ఎమోషనల్ , సెంటిమెంట్ ఇలా ప్రతిదీ చాల చక్కగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు.

ఈ సినిమా కథ అంతా అంజనాద్రి అనే ఒక అటవీప్రాంత పల్లెలో జరుగుతూ ఉంటుంది. అంజమ్మ( వరలక్ష్మీ శరత్ కుమార్), తన సోదరుడు హనుమంతు(తేజా సజ్జ)తో కలిసి అక్కడే నివసిస్తూ ఉంటుంది. అంజమ్మ కష్టపడే వ్యక్తి అయితే హనుమంతు అల్లరి చిల్లరగా తిరుగుతూ దొంగతనాలు సైతం చేస్తూ ఉంటాడు. అలాంటి హనుమంతు అదే ఊరి స్కూల్ మాస్టర్ మనవరాలు మీనాక్షి (అమృత అయ్యర్) ప్రేమలో పడతాడు. ఆమె మీద బందిపోట్లు దాడి చేయడంతో ఆమెను రక్షించబోయి అనూహ్యంగా పెద్ద జలపాతంలో పడిపోతాడు. అక్కడ ఆంజనేయస్వామి రక్త ధారతో ఏర్పడిన రుధిర మణి హనుమంతు చేతికి చేరుతుంది. ఆ మణిని సూర్యుని కాంతితో చూస్తే ఆంజనేయ స్వామి శక్తులు వస్తాయి. ఆ శక్తులతో హనుమంతు తన ఊరికి మంచి చేయాలనుకుంటాడు. అయితే చిన్ననాటి నుంచి ఎలా అయినా సూపర్ హీరో అయిపోవాలి అని కలలు కంటూ దానికోసం సొంత తల్లిదండ్రులను కూడా చంపేసిన మైఖేల్ (వినయ్ రాయ్) హనుమంతుకి ఏవో శక్తులు వచ్చాయని తెలుసుకుని అతని నుంచి ఆ శక్తులను అపహరించేందుకు వస్తాడు. ఊరికి మంచి చేయడానికి వచ్చానని అందరినీ నమ్మించి మణిని దక్కించుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది? హనుమంతుని శక్తిని మైఖేల్ హనుమంతు నుంచి అపహరించాడా? ఆ శక్తి కేవలం ఉదయం మాత్రమే ఎందుకు పని చేస్తుంది? హనుమంతు మీనాక్షి ఇద్దరూ ప్రేమలో పడ్డారా? అసలు అంజనాద్రికి వచ్చిన సమస్య ఏమిటి? అనేది సినిమా కథ.

తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయనకు జోడిగా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్, గెటప్ శ్రీను వంటివారు నటించారు.