వర్కవుట్ మారిస్తే .. మంచి ఫలితం

వ్యాయామం – ఆరోగ్యం..

వ్యాయామం చేయాలన్న ఆలోచన రాగానే ఏదో ఒకటి మొదలు పెట్టేయాలనుకుంటారు చాలామంది. అలా కాకుండా, మీ సమస్య, అవసరం.. అన్నీ దృష్టిలో పెట్టుకుని చేయాలి.. అపుడే మీరు కోరుకున్న ఫలితం వస్తుంది.

వ్యాయామం అందరికీ అవసరం .. అయితే మహిళల అవసరాలు కాస్త భిన్నంగా ఉంటాయి.. కొందరికి ఆందోళన, మరికొందరికి థైరాయిడ్ , ఇంకొందరికి పీసీఓడీ, సమస్య ఏదైనా వారి శారీరక స్థితి. ఆనారోగ్యాలు వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని వ్యాయామ ప్రణాళిక వేసుకోవాలి.. ఆ తర్వాతే యోగ, జుంబా, బ్రెడ్ మిల్ ,.. ఇలా ఏదైనా సరే ! లేదంటే లక్ష్యాన్ని చేరుకోలేక పోవచ్చు..

ఇంటి పని, వంట పని చేసుకునేటప్పటికే బోలెడంత అలసట.. ఇంకెక్కడి వ్యాయామం అంటుంటారు కొందరు.. అది నిజమే కావచ్చు.. ఇంటి పనులు శ్రమతో కూడుకున్నదే.. అయినప్పటికీ ఓ క్రమ పద్దతిలో చేయక పోవటం వలన ఫలితం పూర్తి స్థాయిలో శరీరానికి , అంతకంటే మించి మెదడుకు అందదు.. అందుకే ఇంటి పనులను కూడా లెక్కలేసుకుని చేస్తే మీ పని సరదాగా పూర్తవుతుంది.

Womens-Workout
Womens-Workout

బరువు తగ్గాలని పెట్టుకునే లక్ష్యం వాస్తవానికి దగ్గరగా ఉండాలి.. అంతేకానీ చేరుకోలేని వాస్తవాలను అంటే . ఒక నెలలో కనీసం 5 కిలోలు తగ్గిపోవాలి.. వంటి భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవద్దు. దాని వలన నిరాశే తప్ప సానుకూల ఫలితాలు సాధించలేం ..

ప్రతి నెలా వ్యాయామాలను మారుస్తూ ఉండాలి. నిపుణుల సాయంతో కొత్త తరహా కసరత్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది..
ఏళ్ళ తరబడి ఒకే లాంటివి చేయటం వలన వచ్చే ఫలితాలు కూడా ఉండవు ..

ఆధ్యాత్మికం వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/devotional/