గుటకేస్తే చాలు..!

కోల్ కతా స్ట్రీట్‌ చాయ్ కబుర్లు

Kolkata Street Chai
Kolkata Street Chai

ఒక్కొక్క ప్రాంతం ఒక్కొ వంటలకు ప్రసిద్ధిగా ఉంటుంది. కోల్‌కతా రసగుల్లా, కాశ్మీర్‌ పలావ్‌, ముబై వడాపావ్‌, హైదరాబాద్‌ బిర్యానీ ఇలా ఒక్కో ప్రాంతం ఒక్కో వంటకానికి ఫేమస్‌.

అయితే ఆయా ప్రాంతాలు కేవలం వంటకాలకే కాదు, ప్రత్యేకమైన టీ రుచులకి పెట్టింది పేరే. అలాంటి వాటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కోల్‌కతా స్ట్రీట్‌ చాయ గురించే.

అక్కడ ఏ వీధికెళ్లినా చిన్న మట్టికుండల్లో టీ అందించే దుకాణాలు కోకొల్లలు.

పాలూడికాక్షన్‌ మరిగించి, కాస్త అల్లం దట్టించి, ఇంకాస్త ఇలాచీ పట్టించి, మరికాస్త జాజికాయపొడి, అమెరికన్‌ కుంకుమపుప్వు జోడించి ఇచ్చే ఆ టీ ఓ గుటకేస్తే చాలు, మెదడు పాదరంలా పరిగెడుతుంది అంటారు .

దాన్ని రుచి చూసినవాళ్లు. అందుకే అది బెస్ట్‌ ఇండియన్‌ స్ట్రీట్‌ చాయ్ గానూ పేరొందింది.

తరువాత చెప్పుకోదగ్గది వహ్వా అనిపించే ‘కాశ్మీర్‌ కహ్వా దోస, పుచ్చగింజలూ, కుంకుమపువ్వు, గులాబీరేకులు, యాలకులు, దాల్చినచెక్క వంటి సుగంధద్రవ్యాలన్నీ కలగలిపిన గ్రీన్‌ టీ.

పొడిని వేసి కాచే కాశ్మీరీ కహ్వాలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తే ఒత్తిడితోపాటు జీర్ణసమస్యలన్నీ పరారే.

కాశ్మీర్‌కే ప్రత్యేకమైన మరో రకమే నూన్‌ చాయ్, మరిగించి అందులో పాలు, ఉప్పు కలిపి మరీ అందించే ఈ టీ ప్లేవర్కఇ సాటి లేదంటారు కాశ్మీరీలు.

హిమాలయాల్లోని లద్దాఖ్‌, టిబెట్‌ ప్రాంతాల్లోకి వెళితే తేయాకు నీళ్లలో కాస్త ఉప్పు, జడలబర్రె పాల నుంచి తీసిన వెన్న వేసి కలిపి ఇస్తారు.

అక్కడి చల్లదనానికి త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు చిట్టిచిట్టి కప్పుల్లో అందించే ఈ టీ రెండు సిప్‌లే ఉంటుంది.

అయితే రెప్పపాటు కాలంలో మళ్లీ కప్పుని నింపేస్తారక్కడి ్‌వాలాలు. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఈ టీ వాళ్లకి శక్తినివ్వడంతోబాటు, చలిబరి నుంచి పెదాలు పగిలిపోకుండా కాపాడుతుందట.

ముంబయి విషయానికి వస్తే మాత్రం పాలల్లో బ్లాక్‌, గ్రీన్‌ ఇలా రకరకాల తేయాకులు .

టీపొడితోపాటు అల్లం, యాలకులు, సోంపుగింజలు కూడా వేసి మరిగించి ఇచ్చే ‘బాంబే కటింగ్‌ చాయ్ రుచే వేరు అంటారు తేనీటి ప్రియులు.

పైకీ కిందకి బాగా తిరగబోసి గ్లాసులో సగానికి మాత్రమే పోసి ఇవ్వడం వల్లే దానికి కటింగ్‌ చాయ్ అని పేరు.

అక్కడి రోడ్డుపక్క దుకాణాల్లోనే కాదు, కెఫె, రెస్టరెంట్లలో కూడా దీన్ని సమోసా, కారా బిస్కట్లతో కలిపి మరీ సర్వ్‌ చేస్తారు.

‘అమృత తుల్య అని పిలిచే పుణె టీ పేరుకే కాదు, రుచిలోనూ అద్భుతమే.

తాజా అల్లం, యాలకుల పొడి, టీ ఆకులు వేసి ఇత్తడి గిన్నెలో బాగా మరిగించి ఇచ్చే ఆ తేనీటి రుచిని వర్ణించతరం కాదు అంటారు పుణెవాసులు.

ఇటీవల ఈ నగరం నిప్పుల్లో కాల్చిన పిడతల్లో పొంగించి, మట్టికప్పుల్లో అందించే తందూరీ చా§్‌ుకీ పేరొందింది.

హైదరాబాద్‌కు వస్తే మాత్రం ఇరానీ టీనే పాపులర్‌.

డికాక్షన్‌లో చిక్కని పాలు, కోవా, పంచదార వేసి బాగా మరిగించి ఇచ్చే ఇరానీ టీ రుచి ముందు మిగిలినవన్నీ బలాదూరే అనే చా§్‌ు ప్రియులకి లెక్కేలేదు.

ఇక పాలల్లో టీపొడితో బాటు అల్లం, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం, తులసి ఇలా రకరకాల దినుసులన్నీ వేసి మరిగించే ఇండియన్‌ మసాలా చాయ్ కి ప్రాంతంతో సంబంధం లేదు.

దేశంలోని ఎక్కడయినా దొరికే ఈ చాయ్ కి ఫిదా కాని వాళ్లెవరుంటారు?

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/