కాంగ్రెస్ గెలుపుతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది

పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి వారిలో భయం పట్టుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేసిన ఆఫీసర్లపై చర్యలు తప్పవని కాంగ్రెస్ నేతలు హెచ్చరించడం తో సదరు అధికారులు టెన్షన్ లో ఉన్నారు. సేఫ్‌గా ఉండేందుకు చాలా మంది బ్యూరోక్రట్స్ కాంగ్రెస్ లీడర్లకు వద్దకు క్యూ కట్టడం మొదలుపెట్టారు.

కేసీఆర్ సర్కారులో అత్యంత ఎక్కువ కాలం కీలకమైన శాఖలు చూసిన ఆఫీసర్లను బదిలీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. తొలి కేబినెట్ సమావేశం జరిగిన వెంటనే జయేశ్ రంజన్, అర్వింద్ కుమార్, స్మితా సబర్వాల్‌ను తప్పించే చాన్స్ ఉంది. ఎందుకంటే జయేశ్ రంజన్ ఐటీ అండ్ ఇండస్ట్రీ, అర్వింద్ కుమార్ మున్సిపల్ సెక్రటరీలుగా చాలా కాలం పాటు పనిచేశారు. బీఆర్ఎస్ లీడర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్టు కాంగ్రెస్ లీడర్లు భావిస్తున్నారు.

అలాగే పదేండ్లపాటు సీఎంఓ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్‌పై కూడా కాంగ్రెస్ లీడర్లు కోపంగా ఉన్నారు. మిషన్ భగీరథ స్కీమ్ కార్యకలాపాలు ఆమె కనుసన్నల్లోనే కొనసాగాయి. ఆ స్కీమ్ కమీషన్ భగీరథగా కాంగ్రెస్ విమర్శలు చేసింది. రూ. వేల కోట్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించింది. ఆమెపై కూడా కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం నడుస్తుంది. ఇలా అనేక శాఖల అధికారుల ఫై కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. దీంతో ఆయా శాఖల అధికారులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. మరో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.