చంచల్‌గూడ జైలుకు తీన్మార్‌ మల్లన్న

హైదరాబాద్ : తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. విచారణ నిమిత్తం చిలకలగూడ పోలీసులు మల్లన్నను కస్టడీలోకి తీసుకున్నారు. జోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ కేసులో అరెస్ట్‌ అయిన తీన్మార్‌ మల్లన్నను తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌లో చిలకలగూడ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌, క్రైంబ్రాంచ్‌ పోలీసులు నాలుగురోజుల పాటు విచారించారు. కస్టడీ ముగియడంతో గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం భారీ బందోబస్తు మధ్య మల్లన్నను జైలుకు తరలించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/