ఐపిఎల్‌ జరిగితే ఆడతా.. బెన్‌ స్టోక్స్‌

ఓ అంతర్జాతీయ పత్రికకు వెల్లడి

ben stokes
ben stokes

లండన్‌: ఐపిల్‌ జరిగితే తాను ఆడతానని ఇంగ్లాండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ తెలిపాడు. ప్రస్తుతం ఇండియాలో లాక్‌ డౌన్‌ ఉండడంతో ఐపిఎల్‌ మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 15కు వాయిదా పడింది. ఒకవేళ అప్పటి నుండి ఐపిఎల్‌ ప్రారంభమయితే ఆడతానని, అందుకు తాను సిద్దంగా ఉన్నానని బెన్‌ స్టోక్స్‌ స్పష్టం చేశాడు. ఈ విషయం ఇటీవల ఓ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడిన సందర్బంలో వ్యక్తం చేశాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/