వేచి ఉండడం చాలా కష్టం

ఒలంపిక్‌ వాయిదాపై తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన వినేశ్‌ ఫొగాట్‌

vinesh phogat
vinesh phogat

న్యూఢిల్లీ: కరోనా ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. దీని దాటికి ప్రపంచలో జరగాల్సిన అన్ని క్రీడా టోర్నీలు రద్దు అయ్యాయి. ఈ మధ్యనే ఒలంపిక్‌ టోర్ని కూడా వాయిదా పడడంతో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ పొగాట్‌ స్పందించింది. చివరకు తాము భయపడిందే జరిగింది. ఒలంపిక్‌ వాయిదా పడడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఒలంపిక్‌ లో పోటి పడడం చాలా కఠినమైన పరీక్ష. కాని ఆ పోటి కోసం సుధీర్ఘకాలం వేచి చూడడం ఇంకా కష్టం. ఒలంపిక్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడడంపై ఎలా స్పందదించాలో కూడా తెలియట్లేదు. అని వినేశ్‌ పోగాట్‌ నిరాశను వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/