రెపో, రివర్స్‌ రెపో రేటులకు తగ్గించిన ఆర్‌బిఐ

వెల్లడించిన ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతా దాస్‌

shakti kantha das
shakti kantha das

దిల్లీ: దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. గత నాలుగు రోజులుగా పరపతిని సమీక్షించిన ఆర్‌బిఐ, రెపో రేటును 75 బేసిక్‌ పాయింట్లు, రివర్స్‌ రెపొ రేటును 90 బేసిక్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతా దాస్‌ ప్రకటించారు. ఇటీవలి కాలంలో వడ్డీరేటులో ఇంత కోతను విదించటం ఇదే తొలిసారి. దీంతో రెపో రేటు 4.4 శాతానికి చేరుతుంది. అయితే పరపతి కమిటీలో అత్యధికులు ఈ తగ్గింపును సమర్ధించారని ఆయన తెలపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/