సూపర్‌ఓవర్‌ ఆడాల్సి వస్తుందని ఊహించలేదు!

అందుకే తనకు సంబంధించిన వస్తువులన్నీ ముందుగానే బ్యాగులో సర్ధుకున్నా

Rohit Sharma
Rohit Sharma

హామిల్టన్‌: సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వస్తుందని తాను ఊహించలేదని టీమ్‌ ఇండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. అందుకే తనకు సంబంధించిన వస్తువులన్నీ ముందే బ్యాగులో సర్దేసుకున్నానని పేర్కొన్నాడు. నా వస్తువులన్నీ అందులోనే ఉండిపోయాయి. ఎక్కడుందో తెలియకపోవడంతో అబ్‌డామిన్‌ గార్డు వెతికేందుకు ఐదు నిమిషాలు పట్టిందని తెలిపాడు. కివీస్‌ బ్యాటింగ్‌ చూస్తు సూపర్‌ ఓవర్‌ ఆలోచన రాలేదని వారు సులభంగా మ్యాచ్‌ గెలుస్తారని అనిపిందన్నాడు. సూపర్‌ ఓవర్‌ పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేయడంపై సాధనేమీ ఉండదన్నాడు. సాధారణంగా సూపర్‌ ఓవర్‌లో బౌలర్‌పై ఒత్తిడి ఉంటుంది. అందుకే ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేశా. చివర్లో క్రీజలో ఉండాలా? ముందుకొచ్చి ఆడాలా? అన్న ఆలోచనలు వచ్చాయి. కానీ బౌలర్‌ నా పరిధిలో బంతులు వేయడంతో చితకబాదనని రోహిత్‌ శర్మ తెలిపాడు. సూపర్‌ ఓవర్లో కివీస్‌ 17 పరుగులు చేసింది. కాగా భారత విజయానికి ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా రొహిత్‌ శర్మ వరుస సిక్సర్లు బాది టీంఇండియాను గెలిపించాడు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/