కరోనా ఎఫెక్ట్‌.. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ భేటి

బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు

bcci
bcci

ముంబయి: కరోనా ప్రభావం క్రీడా రంగం పై కూడా పడింది. ఈనేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ సమావేశం నిర్వహించింది. ముంబయిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు హాజరయ్యారు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ప్రేక్షకుల ఆరోగ్యం కోసం బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు స్వాగతించారు. కరోనాపై పోరులో భాగంగా బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర వ్యవస్థలతో కలిసి పనిచేస్తుందని బోర్డు వెల్లడించింది. కాగా కరోనా వల్ల ఇప్పటికే ఐపీఎల్ ప్రారంభం వాయిదా పడగా, టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మిగిలిన రెండు వన్డేలు రద్దయ్యాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/