తెలంగాణలో పోరాటం చేస్తానన్న షర్మిల ఏపీకి ఎందుకొచ్చారుః రోజా

Why did Sharmila come to AP saying that she will fight in Telangana: Roja

అమరావతిః ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ ను జైలుకు పంపిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పోరాటం చేస్తానని చెప్పుకున్న షర్మిల… ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి ఏపీలోకి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ఏపీలో ఏ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ లో చేరారో చెప్పాలని అన్నారు. వైఎస్‌ఆర్‌ బతికుంటే కాంగ్రెస్ పై ఉమ్మేసేవారని షర్మిల అన్నారని.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీలో చేరానని ప్రశ్నించారు. షర్మిలకు ఒక సలహా ఇస్తున్నానని… తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని… తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సి రూ. 6 వేల కోట్లను తీసుకురావాలని రోజా చెప్పారు. ఏపీకి రావాల్సిన రూ. లక్ష 80 వేల కోట్ల ఆస్తులను రాబట్టాలని అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.