చెస్‌ క్రీడాకారుకు ఏపి గవర్నర్‌ అభినందనలు

స్వర్ణం సాధించి రికార్డు సృష్టించారు..గవర్నర్‌ బిశ్వభూషణ్‌

Biswabhusan Harichandan
Biswabhusan Harichandan

అమరావతి: ఏపి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఫిడె చెస్‌ ఒలింయాడ్‌లో స్వర్ణం సాధించిన భారత క్రీడాకారులను అభినందించారు. ఈ సంద‌ర్భంగా భార‌త క్రీడాకారులు విశ్వ‌నాథ‌న్ ఆనంద్, కొనేరు హంపి, ద్రోణవల్లి హారిక, హ‌రికృష్ణ త‌దిత‌రులకు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. స్వ‌ర్ణం సాధించి కొత్త రికార్డు సృష్టించారంటూ క్రీడాకారుల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. చద‌రంగంలో క్రీడాకారులు మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌ని ఆకాంక్షించారు. ఫైడ్‌ ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో ర‌ష్యాతో క‌లిసి భార‌త జ‌ట్టు సంయుక్తంగా విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. 96 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారిగా భార‌త జ‌ట్టు స్వ‌ర్ణం సాధించింది. చ‌క్క‌ని విజ‌యాల‌తో మొద‌టిసారి ఈ టోర్నీ ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన భార‌త్.. ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూ బ‌ల‌మైన ర‌ష్యాను దీటుగా ఎదుర్కొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/