గ్రూప్‌- 4 పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలో గ్రూప్‌-4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు (TSPSC Group 4 Results) విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) శుక్రవారం రాత్రి వెల్లడించింది.

గ్రూప్-4 కింద 8,180 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడిన సంగ‌తి తెలిసిందే. 7,26,837 మందిని మెరిట్ జాబితాలో పేర్కొన్నారు. ధ్రువ‌ప‌త్రాల వెరిఫికేష‌న్‌కు ఎంపికైన వారి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గతేడాది జులైలో గ్రూప్-4 రాత‌ప‌రీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అభ్య‌ర్థులు వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ లో ర్యాంకులు చూసుకోవాల‌ని టీఎస్‌పీఎస్సీ సూచించింది.