మా తండ్రి బ్ర‌తికి ఉన్న స‌మ‌యంలో ఈ అవార్డు వ‌స్తే ఎంతో సంతోషించే వారుః సౌమ్యా స్వామినాథ‌న్

They would have been very happy if this award has come during our father lifetime: Soumya Swaminathan

న్యూఢిల్లీ: ఈరోజు కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత ఎంఎస్ స్వామినాథ‌న్‌ కు భార‌త ర‌త్న పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఎంఎస్ స్వామినాథ‌న్ కూతురు, డ‌బ్ల్యూహెచ్‌వో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్ ఈ నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడారు. త‌న తండ్రి బ్ర‌తికి ఉన్న స‌మ‌యంలో ఈ అవార్డు వ‌స్తే ఆయ‌న కూడా ఎంతో సంతోషించేవార‌ని ఆమె అన్నారు. త‌న తండ్రి ఎన్నడు కూడా అవార్డుల కోసం కానీ గుర్తింపు కోసం కానీ ఎదురుచూడ‌లేద‌ని ఆమె తెలిపారు. చేసిన ప‌నుల ద్వారానే ఆయ‌న ప్రేర‌ణ పొంది ముందుకు వెళ్లార‌ని సౌమ్యా స్వామినాథ‌న్ పేర్కొన్నారు.