నేడు ఏపి మంత్రివర్గం సమావేశం

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: ఈరోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో ఏపి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. వాస్తవానికి ఈ సమావేశం నాలుగో తేదీనే జరగాల్సి వుండగా, ఐదో తేదీకి వాయిదా వేస్తున్నట్టు నిన్ననే ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఈమధ్య కాలంలో మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ముందుగా ప్రకటించడం, ఆపై వాయిదా వేయడం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలలో ఒకటి, మూడవ బుధవారాల్లో మంత్రులతో సమావేశం అవనున్నట్టు జగన్ ముందుగానే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, అనివార్య కారణాలతో ఈ షెడ్యూల్ అమలు కాలేదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/