హైదరాబాద్ లో మరోసారి వీధి కుక్కల దాడి ..చిన్నారికి గాయాలు

హైదరాబాద్ మహానగరంలో మరోసారి వీధి కుక్కల దాడి చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ఫై వీధి కుక్కలు దాడి చేసాయి. ఈ దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మీర్ పేట్ లో చోటుచేసుకుంది. కొద్దీ రోజుల క్రితం పెద్ద అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడి ఫై దాడి చేసి చంపేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రభుత్వం వీధి కుక్కల విషయంలో పలు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాల తర్వాత కూడా వీధి కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి, ప్రస్తుం రోజు రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కుక్కల దాడుల ఘటనలు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి.

తాజాగా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 45వ డివిజన్ లో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. బాలుడి అరుపులకు ఇంట్లో నుంచి తల్లిదండ్రులు పరుగెత్తుకుంటూ బయటకు వచ్చారు. అప్పటికే వీధి కుక్కలు బాలుడిని పీక్కుతినడానికి ప్రయత్నించడంతో స్థానికులు గమనించి..వాటిని తరిమికొట్టడంతో పారిపోయాయి. కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడిని కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.