తెలంగాణ సీఎస్ రేసులో ఎవరెవరు ఉన్నారంటే..!

తెలంగాణ సీఎస్ సోమేశ్ ప్లేస్ లో మరో కొత్త సీఎస్ రాబోతున్నారు. ప్రస్తుతం ఉన్న సోమేశ్ కుమార్ ను వెంటనే ఏపీకి వెళ్లాలని హైకోర్టు సూచించింది. క్యాట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ నుంచి సోమేష్ కుమార్‌ను రిలీవ్ చేస్తూ.. ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన. ఈ నెల 12లోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని తెలిపింది.

దీంతో ఇప్పుడు తెలంగాణలో కొత్త సీఎస్ రాబోతున్నారు. మరి కొత్త సీఎస్ బరిలో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు తెలంగాణ కొత్త సీఎస్ విషయంలో ఈసారి తెలుగువారికి అవకాశమవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే.. సీఎస్ రేసులో రామకృష్ణారావు, అరవింద్ కుమార్ ఉన్నారు. రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకటిని సీఎస్‌ను నియమించే అవకాశముండగా.. ఎక్కువ శాతం రామకృష్ణారావుకే అవకాశమున్నట్టు సమాచారం అందుతుంది.

మరోపక్క సోమేశ్ ఏపీకి వెళ్లేందుకు విముఖతో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. మరో ఏడాది కాలంలో సోమేష్ కుమార్ రిటైర్ కాబోతున్నారు. దీంతో ఏపీకి వెళ్లకుండా ఆయన ఏడాది ముందుగానే వీఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.