జగన్, చంద్రబాబు చివరి ప్రచారం ఎక్కడంటే..!!

ఏపీలో ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి శుభం కార్డు పడనుంది. దాదాపుగా రెండునెలలుగా ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతూ వచ్చింది. మరో 48 గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఈ సాయంత్రంతో ప్రచారాన్ని అన్ని రాజకీయపక్షాలు ముగించాల్సి ఉంటుంది. హోరెత్తిన మైకులు ..సాయంత్రం 6 తర్వాత మూగబోనున్నాయి. ఇక చివరి రోజు అని పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనీ చూస్తున్నాయి.

ఈ తరుణంలో చిత్తూరు, నంద్యాలలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా.. వైఎస్ జగన్ పల్నాడు, ఏలూరు జిల్లా, కాకినాడలో ప్రచారం చేయనున్నారు. జేపీ నడ్డా సైతం తిరుపతిలో కూటమి నేతలతో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. చంద్రబాబు నేడు రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మ. 12.30 నుంచి 1.30 గంటల వరకు నంద్యాల సభలో పాల్గొంటారు. సాయింత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు చిత్తూరు సభలో ప్రచారం చేయనున్నారు. జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు జిల్లా కైకలూరు, మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగే బహిరంగ సభలో ప్రచారం చేయనున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సైతం తిరుపతిలో కూటమి నేతలతో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు.