మొన్న అనుష్క – నేడు ప్రభాస్ ‘కళ్యాణం కమనీయం ‘

సంతోష్ శోభన్ – ప్రియా భవాని శంకర్ జంటగా అరుణ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ కళ్యాణం కమనీయం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ పాన్ ఇండియా స్టార్స్ తో ప్రమోషన్ చూపిస్తూ సినిమా ఫై క్రేజ్ తెస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా తాలూకా ట్రైలర్ ను భాగమతి అనుష్క చేత విడుదల చేయించి ఆసక్తి రేపిన మేకర్స్, ఈరోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ‘సింగిల్ లైఫ్ అంటే సింపుల్ అంటారు .. బాబూ చెయ్యొద్దా తప్పు’ అంటూ సాగే పాట ను విడుదల చేయించారు. ‘కల్యాణం కమనీయం కద బాసూ .. అరె సోలోగున్నావంటే ఉండదు జోషు’ అంటూ ఈ సాంగ్ సాగుతుంది.

శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించాడు. ఈ పాటకి యశ్ కొరియోగ్రఫీని నిర్వహించాడు. పెళ్లికి హీరో ఒప్పించడమనే ఒక కాన్సెప్ట్ ను తీసుకుని, ఆ అంశానికి ఈ పాటను లింక్ చేసి వదిలారు. పెద్ద సినిమాల మధ్యలో బరిలోకి దిగుతున్న ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి. సంతోష్ శోభన్ నుంచి ఇటీవల వచ్చిన ‘మంచిరోజులొచ్చాయి’ .. ‘ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సంతోష్ మాత్రం ఈ సినిమా మంచి విజయం సాదిస్తుందని ధీమా గా ఉన్నాడు.

YouTube video