ఇపుడు నా వంతు: ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్

జెనీవాలో క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న టెడ్రోస్ అధనామ్

WHO Director-General Tedros Adhanom Ghebreyesus
WHO Director-General Tedros Adhanom Ghebreyesus

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ క‌రోనా టీకా తీసుకున్నారు. టీకా తీసుకున్న‌ట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జెనీవాలోని యూనివ‌ర్షిటీ హాస్పిట‌ల్‌లో టెడ్రోస్ క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. అయితే, ఏ బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్న‌ది వెల్ల‌డించ‌లేదు. త‌న పేరును రిజిస్ట‌ర్ చేసుకున్నఆయన వంతు వ‌చ్చింద‌ని స‌మాచారం రావటంతో టీకా వేయించుకున్నారు . ప్ర‌జ‌లంతా అందుబాటులో ఉన్న టీకాలు తీసుకొని ప్రాణాల‌ను కాపాడుకోవాల‌ని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు కొవిడ్‌-19 కు టీకా వేసుకునే నా వంతు వ‌చ్చింది. టీకాలు ప్రాణాలను కాపాడతాయి. వాటిని అన్ని ప్రాంతాలకు తీసుకురావడం చాలా క్లిష్టమైనది. నాలాగా మీరంతా టీకాలు అందుబాటులో ఉన్న దేశంలో నివసిస్తుంటే.. దయచేసి మీ వంతు వ‌చ్చినప్పుడు టీకాలు తీసుకోండి” అని ట్విట్ట‌ర్‌లో పిలుపునిచ్చారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/