మహారాష్ట్రలో జూన్ 1 వరకు లాక్ డౌన్ పొడిగింపు

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Maharashtra CM Uddhav Thackeray
Lockdown extension till June 1 in Maharashtra- CM Uddhav Thackeray

Mumbai: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కారణంగా లాక్ డౌన్ ను జూన్ 1 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. రవాణా మార్గం ద్వారా రాష్ట్రంలోకి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. ఈమేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనల్ని పాటించాలని , భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రపర్చుకోవడం, మాస్క్ ధరించడం తప్పనిసరిగా పాటించాలన్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/