విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్‌ రైలు రద్దు..ప్రయాణికుల ఆగ్రహం

రైలు సాంకేతిక కారణాలతో రద్దయినట్టు అధికారుల ప్రకటన

Cancellation of Visakha-Secunderabad Vande Bharat train

విశాఖః గురువారం(ఈరోజు) ఉదయం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ రైలును రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. సాంకేతిక సమస్యల కారణంగా ఈ ఉదయం గం.5.45కు బయలుదేరాల్సిన రైలును రద్దు చేసినట్టు వివరించారు. అయితే, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 7 గంటలకు మరో రైలును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వందేభారత్ రైలు ఆగే స్టేషన్లన్నింటిలో ఈ రైలు ఆగుతుందని చెప్పారు. ఉదయం 5 గంటల నుంచే రైలు రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు అందజేశామని వివరించారు. కాగా, చివరి నిమిషంలో వందేభారత్ రైలు రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.