2022లో క‌రోనా మ‌హ‌మ్మారిని అంతం చేయాలి: టెడ్రోస్

పండ‌గ‌ల వేళ‌ ఆంక్ష‌లు త‌ప్ప‌నిస‌రి.. ప్రాణాలు పోగొట్టుకోవ‌డం కంటే అదే మేలు

జెనీవా: ఒమిక్రాన్ లాంటి కొత్త కొ్త్త వేరియంట్ల‌ రూపంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచంలో క‌ల‌క‌లం సృష్టిస్తున్న స‌మ‌యంలో పండ‌గ‌ల వేళ‌ ఆంక్ష‌లు త‌ప్ప‌నిస‌రిగా విధించాలి అన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధ‌న‌మ్ అన్నారు. ప్ర‌పంచ దేశాలన్నీ క‌ల‌సిక‌ట్టుగా క‌రోనా మ‌హమ్మారిని 2022 సంవ‌త్స‌రంలో అంతం చేయాలని, ఇందుకోసం అంద‌రూ క‌ఠినమైన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న‌ అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్ర‌స్తుతం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ మిగ‌తా వేరియంట్ల క‌న్నా చాలా వేగంగా వ్యాపిస్తోంది.. అందువ‌ల్ల ప్రాణాలు పోగొట్టుకోవ‌డం క‌న్నాపండ‌గ‌లు చేసుకోక‌పోవ‌డం మంచిది . అలాగే చాలా దేశాలలో ఇప్ప‌టికే జ‌నం మొద‌టి డోస్ కోసం ఎదురుచూస్తున్నారు.. మ‌రోవైపు ధ‌నిక దేశాలు వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకుంటున్నాయి.. ఈ ప‌రిస్థితి మారాలి. ప్ర‌పంచ‌మంతా సమాంత‌రంగా వ్యాక్సినేష‌న్ జ‌రిగితే మంచిది” అని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/