ఈరోజు బీజేపీ రెండో జాబితా..?

రెండు సార్లు అధికారం చేపట్టిన బిజెపి..మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టిన మోడీ..ఈరోజు రెండో జాబితా ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో పరాజయం పాలైన నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని, అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో 9 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు ప్రకటించనున్న జాబితాలో డీకే అరుణ, జలగం వెంకటరావు, రఘునందనరావుల పేర్లు ఉన్నట్లు సమాచారం.

మొదటి జాబితాలో 195 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును ప్రకటన చేయగా..వారణాసి నుంచి ప్రధాని మోడీ మరోసారి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ జాబితాలో 28 మంది మహిళలకు స్థానం కల్పించారు. తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పేర్లను ఖరారు చేసింది. గాంధీ నగర్ నుంచి అమిత్ షా పోటీ చేయనున్నారు. జాబితాలో 36 కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. 57 మంది ఓబీసీలకు చోటుదక్కింది. ఉత్తరప్రదేశ్‌లో 51, గుజరాత్ లో 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరి ఈరోజు రెండో జాబితాలో ఎంతమందిని ప్రకటిస్తారో చూడాలి.