నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై స్పందించిన రోజా

అవన్నీ దొంగ ఏడుపులే.. దానికి స్పందించడం ఏంటి….రోజా


అమరావతి: నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై మ్మెల్యే రోజా స్పందించారు. ఆడవాళ్లను అనవసరంగా ఏడిపించిన వాళ్లు వారి పాపాన వాళ్ళే పోతారన్నారు. చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. అప్పుడు మాట్లాడని భువనేశ్వరి, ఇప్పుడు చంద్రబాబు దొంగ ఏడుపులకు స్పందించడం ఏంటని ప్రశ్నించారు. అందుకే చంద్రబాబు 23 సీట్లకు పరిమితమయ్యారని మీరు గుర్తించాలన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వంగా పని చేస్తోందన్నారు. ఆడవాళ్లకు సముచిత స్థానం కల్పిస్తోందని.. మీ భర్త చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఆడవాళ్లకు జరిగిన అన్యాయం గురించి మీరు ఎప్పుడూ మాట్లాడ లేదేంటని ప్రశ్నించారు. ఇప్పుడు మీరు గొప్పగా మాట్లాడుతుంటే అది మీ భ్రమే అవుతుందని హితవు పలికారు.

ఎమ్మార్వో వనజాక్షి పై దాడి, మహిళా పార్లమెంటుకు పిలిచి అవమానపరిచి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన రోజు కనిపించని భువనేశ్వరి ఇప్పుడు జరగని దాన్ని జరిగినట్లు మాట్లాడితే నమ్మేవారు లేరన్నారు. నీ భర్త దొంగ ఏడ్పులు ఏడిస్తే ఇప్పుడు మీరు మాట్లాడటం చూస్తుంటే చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం మామనే కాదు భార్యను కూడా రోడ్డున పెడుతున్నారని రాష్ట్ర ప్రజలు గమనించారని.. ఇకనైనా భువనేశ్వరి కేర్ ఫుల్ గా ఉండాలన్నారు నగిరి వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/