ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదు : సీఎం జగన్

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

YouTube video
Hon’ble CM of AP will be Launching “Jagananna Sampoorna Gruha Hakku” Scheme at Tanuku, WG Dist. LIVE

తణుకు: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని మంగళవారం సీఎం జగన్ తణుకులో ప్రారంభించారు. ఈసందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. ‘ఇప్పటి వరకు 31లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా సొంతింటి కల నెరవేరుస్తున్నాం. 50 లక్షల మంది కుటుంబాలకు మంచి జరిగే రోజు ఇది. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదు.

సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు. గతంలో నివసించే హక్కు స్థానంలో సర్వహక్కులతో రిజిస్ట్రేషన్‌ చేయించాము. 26వేల కోట్ల రూపాయల విలువైన 31 లక్షల ఇళ్లు మంజూరు చేశాము. ఈ పథకం కింద దాదాపు రూ.10వేల కోట్ల రుణమాఫీ చేశాము. రూ.6వేల కోట్ల రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఛార్జీల మినహాయింపు ఇచ్చాము. 52లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ అక్షరాలా రూ.లక్షా 58వేల కోట్లు. అందరూ లబ్ధి పొందాలనే ఆలోచనలో భాగంగానే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఉగాది వరకు పొడిగిస్తున్నాం’ అని సీఎం జగన్‌ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/