ఆస్ట్రేలియా మాజీ స్పిన్న‌ర్ మెక్‌గిల్ కిడ్నాప్ కేసులో న‌లుగురు అరెస్ట్

భవనంలోకి తీసుకెళ్లి చితకబాది, గన్ తో బెదిరించిన నిందితులు

Mac Gill
Mac Gill

ఆస్ట్రేలియా క్రికెట్‌ మాజీ స్టార్ స్పిన్న‌ర్ స్టువర్ట్ మెక్‌గిల్ కిడ్నాప్ కేసులో న‌లుగురిని అరెస్ట్ చేశారు. సిడ్నీలో బుధ‌వారం తెల్ల‌వారుఝామున‌ అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆస్ట్రేలియా క్రికెట్‌లో షేన్ వార్న్ ఉన్న తరుణంలోనే మెక్‌గిల్ అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా త‌ర‌ఫున 44 టెస్టులు కూడా ఆడాడు. ఏప్రిల్ 14న మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేశారు. ఓ వాహ‌నంలో సిడ్నీ నుంచి దూరంగా తీసుకెళ్లి ఓ బిల్డింగ్‌లో బంధించి తీవ్రంగా బాది, గ‌న్‌తో బెదిరించారు. అత‌ని నుంచి భారీ మొత్తం డిమాండ్ చేశారు. గంట త‌ర్వాత మెక్‌గిల్‌ను విడిచి పెట్టారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/