కాంగ్రెస్ అహంకారాన్ని దించేందుకు ప్ర‌జ‌లు సిద్ధమయ్యారు – కేసీఆర్

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ నాగ‌ర్‌క‌ర్నూల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన రోడ్ షో లో కాంగ్రెస్ పార్టీ ఫై నిప్పులు చెరిగారు. అడ్డ‌గోలు హామీలిచ్చి దుష్ర్ప‌చారాలు చేసి కేవ‌లం ఒక‌టిన్న‌ర శాతం ఓట్ల‌తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. రైతుబంధు అంద‌రికీ వ‌చ్చిందా..? ప్ర‌తి ఆడ‌బిడ్డ‌కు రూ. 2500 వ‌చ్చాయా.? రుణ‌మాఫీ అయిందా..? తులం బంగారం వ‌చ్చిందా..? అమ్మాయిల‌కు స్కూటీలు వ‌చ్చాయా..? వ‌రికి రూ. 500 బోన‌స్ వ‌చ్చిందా..? చివ‌రికి వ‌స్తే ఎండింది ఎండంగ‌.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పెడితే కొనే దిక్కు లేదు. వాన‌ల‌కు త‌డిసిపోతుంది త‌ప్ప‌ కొనే దిక్కు లేదు. ఈ ప్ర‌భుత్వం ప‌రిస్థితి ఇది. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటితే.. కాళ్లు తంగెళ్లు దాటడం లేదని కేసీఆర్ సెటైర్లు వేశారు

బీఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంట్‌లో ఒక్క ఏడాదిలోనే క‌రెంట్ 24 గంట‌లు ఇచ్చాం. రెప్ప‌పాటు క‌రెంట్ పోలేదు. కాంగ్రెస్ రాజ్యంలో క‌రెంట్ పోతుంది. బావుల కాడ తేళ్లు, పాములు క‌డుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 225 మంది రైతులు చ‌నిపోయారు. కొంద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. కొంద‌రు క‌రెంట్ షాకుల‌తో, పాములు క‌ర‌వ‌డంతో చ‌నిపోయారు. ఈ బాధ ఎందుకు వ‌చ్చిందో ఆలోచ‌న చేయండి. కేసీఆర్ పెట్టిన ప‌థ‌కాలు ఇవ్వాలి క‌దా.. కొత్త‌గా గ‌డ్డ‌పార పెట్టి త‌వ్వాల్సిన అవ‌స‌రం లేదు క‌దా..? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు.

ఆనాడు మీ అండ‌దండ‌ల‌తో పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. నా చావుకు కూడా తెగించి దీక్ష ప‌ట్టి తెలంగాణ సాధించాం. కానీ ఇవాళ ఈ రాష్ట్రం ముఖ్య‌మంత్రి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్.. నీ గుడ్లు పీకి గోటీలు అడుకుంటా. నీ పేగులు తీసి మెడ‌లు వేసుకుంటా. ఆఖ‌రికి వ‌స్తే నీ ముడ్డి మీద చెడ్డి కూడా గుంజుకుంటా.. ఇది సీఎం మాట్లాడే భాషేనా..? ఇది ధ‌ర్మ‌మేనా..? తెలంగాణ సాధించిన వ్య‌క్తిని, ఇన్నేండ్లు పోరాటం చేసిన వ్య‌క్తిని, వ‌చ్చిన తెలంగాణ‌ను తెల్ల‌గా చేసిన వ్య‌క్తిని, మంచినీళ్లు, సాగు నీళ్లు, కరెంట్ కోసం తండ్లాడిన వ్య‌క్తిని.. న‌న్ను ప్ట‌టుకుని ఇన్ని మాట‌లు అనొచ్చానా..? ఇది ధ‌ర్మ‌మేనా..?ఇద‌ఇ మ‌న తెలంగాణ గౌర‌వ‌మా..? అని కేసీఆర్ నిల‌దీశారు.