బిఆర్ఎస్ ఓటమికి కారణాలు ఏంటి..?

తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ కు రాష్ట్ర ప్రజలు భారీ షాక్ ఇచ్చారు..రెండుసార్లు విజయం సాధించిన కేసీఆర్..హ్యాట్రిక్ కొట్టాలని ఎన్నో కలలు కన్నాడు కానీ ఆ కలల ఫై ప్రజలు నీళ్లు చల్లారు. ప్రస్తుతం బిఆర్ఎస్ ఓటమికి కారణాలు ఇవే అంటూ అంత మాట్లాడుకుంటున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంతో కేసీఆర్ పార్టీకి పెద్ద దెబ్బ. అవినీతి, అక్రమాల కారణంగానే ప్రాజెక్టు కుంగిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపించడం ప్రజలు గమనించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి మరో ప్రధాన కారణం యువత.

రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సరైన విధానంలో ఉద్యోగాల నోటిఫికేషన్‌లు ఇవ్వకపోవడం, టీఎస్‌పీఎస్సీలో పేపర్ లీకులు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమైంది. రైతు బంధు పథకం కౌలు రైతులకు ఇవ్వకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అని మాట్లాడుకుంటున్నారు. పలు పథకాలను బీఆర్ఎస్ అమలు చేసినా అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు కూడా బిఆర్ఎస్ ఓటమికి కారణమైంది. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతల్లో గర్వం, అహంకారం పెరగడం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది.