‘18 పేజిస్’ నుండి ‘నన్నయ్య రాసిన’ అనే సాంగ్ రాబోతుంది

కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్..వచ్చే నెలలో 18 పేజిస్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా , బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

ఇక ఇప్పుడు ఈ సినిమాలోని ‘నన్నయ్య రాసిన’ అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘నన్నయ్య రాసిన’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు.

కార్తికేయ- 2 తరువాత అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా నటిస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ ఫై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నోస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాయడం విశేషం.