వైసీపీ దాడి వల్ల టీడీపీ కి ఓ మంచి జరిగింది..

వైసీపీ దాడి వల్ల టీడీపీ కి ఓ మంచి జరిగింది..

తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ఫై దాడి జరగడం ఏపీలో రాజకీయంగా వేడి పెంచితే..ఈ దాడి ఓ విషయంలో మాత్రం టీడీపీకి ఓ మంచి జరిగింది. గత కొద్దీ రోజులుగా కేశినేని నాని తెలుగుదేశం పార్టీ కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతే కాదు పార్టీతో సంబంధం లేదని.. టీడీపీ నుంచి గెలిచాను కాబట్టి ఎంపీగా మాత్రం కొనసాగుతునానని చెప్పి కార్య కర్తలకు షాక్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ తో అంత షాక్ అయ్యారు. నిజంగానే నాని పార్టీ కి దూరం అవుతారేమో అని ఖంగారు పడ్డారు.

తాజాగా వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ఫై చేసిన దాడికి నిరసనగా చంద్రబాబు 36 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో కేశినేని నాని..చంద్రబాబు దీక్ష మద్దతు తెలుపడం తో పాటు దీక్ష శిబిరానికి చేరుకొని వైసీపీ తురుపు ఆగ్రహం వ్యక్తం చేయడం తో కార్యకర్తలు కాస్త సంతోష పడ్డారు. దీక్షా స్థలం నుంచి కేశినేని మాట్లాడుతూ.. కిరాయి మూకలు, పోలీసులు అండగా ఉన్నారని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే.. జగన్‌మోహన్ రెడ్డి రేపు అనేది ఒకటుంటుంది గుర్తుంచుకోవాలని చెప్పారు. పెద్ద పెద్ద నియంతలను ఈ ప్రపంచం చూసిందని.. హిట్లర్.. సద్దాం హుస్సేన్‌లు కూడా ప్రజల మద్దతు లేకపోతే కూలిపోయారన్నారు. ప్రజలు మంచి చేస్తే మంచి అంటారు.. చెడు చేస్తే ఈ రోజు నీకు చెప్పకపోవచ్చు కానీ.. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని కేశినాని నాని అన్నారు.