తెలంగాణ ఎన్నికల ఫలితాల ఫై కేటీఆర్ స్పందన

తెలంగాణ ఎన్నికల ఫలితాల ఫై బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఫలితం గురించి బాధపడలేదు, కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందాను. కానీ దీన్ని ఒక పాఠంగా తీసుకుంటాము. తిరిగి పుంజుకుంటాము. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్‌ చేశారు.