తాము భారీ మెజార్టీతో గెల‌వ‌బోతున్నాం

‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన బైడెన్‌

we-are-going-to-win-this-race-said-joe-biden

వాషింగ్టన్‌: డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జో బైడెన్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మట్లాడుతూ… ఈ ఎన్నికల్లో తాము భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు చెప్పారు. ట్రంప్‌పై 4 మిలియన్ల ఓట్ల తేడాతో గెలుస్తామని తెలిపారు. రాజకీయాలు ఉండేవి సమస్యల పరిష్కారాల కోసమేనని చెప్పుకొచ్చారు. తాము ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారమే అయినప్పటికీ రిపబ్లికన్లకు శత్రువులం మాత్రం కాదని వ్యాఖ్యానించారు. తాము కరోనా నివారణకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన రోజే వైర‌స్ నియంత్ర‌ణ కోసం క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఫలితాలు అన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పారు.  త‌మ పార్టీకి సుమారు 7.5 కోట్ల ఓట్లు పోల‌య్యాయ‌ని, అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో ఏ అభ్య‌ర్థికి కూడా ఇన్ని ఓట్లు పోల‌వ్వ‌లేద‌ని బైడెన్ అన్నారు.  300 ఎల‌క్టోర‌ల్ కాలేజీ ఓట్లు ల‌క్ష్యంగా గెల‌వ‌బోతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 

మరోవైపు, ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించిన జార్జియా, పెన్సిల్వేనియాలోనూ తిరిగి బైడెన్ ఆధిక్యంలోకి రావడంతో ట్రంప్ ఓటమి దాదాపు ఖరారైంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/