పూజా హెగ్డే ‘నడుము’ రచ్చ.. నెటిజన్ల ఫైర్!

పూజా హెగ్డే ‘నడుము’ రచ్చ.. నెటిజన్ల ఫైర్!

అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం తెలుగులో రెండు ప్రెస్టీజియస్ చిత్రాల్లో నటిస్తోంది. యంగ్ రెబల్ స్టా్ర్ ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ చిత్రంతో పాటు, అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలోనూ అమ్మడు హీరోయిన్‌గా చేస్తోంది.

అయితే తాజాగా పూజా హెగ్డే దక్షిణాది ప్రేక్షకుల గురించి కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేసింది. ‘సౌత్ ప్రేక్షకులు నడుము అందాలకు పడి చస్తారని’పూజా కామెంట్ చేయడంతో తెలుగు ప్రేక్షకులు ఆమెపై విరుచుకుపడుతున్నారు. సక్సెస్ మరియు ఫేం రాకముందు తమరు చేసింది కూడా అదేగా అంటూ నెటిజన్లు ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. సక్సెస్ వచ్చాక మారిపోయే హీరోయిన్లు ఎక్కువకాలం నిలదొక్కుకోలేరు అనే విషయాన్ని పూజా మర్చిపోయిందని, అందుకే ఆమె ఈ రకమైన కామెంట్స్ చేసిందని పలువురు ఆమెపై మండిపడుతున్నారు.

మొత్తానికి పూజా చేసిన నడుము అందాల కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండటంతో, ఆమె ఫ్యాన్స్ కూడా ఈ కామెంట్స్‌ను ఖండిస్తున్నారు. తనకు ఫేం తీసుకొచ్చిన దక్షిణాది ప్రేక్షకులను ఈవిధంగా అవమానించడం మంచి పద్ధతి కాదని, వెంటనే ఆమె వారికి క్షమాపణలు చెప్పాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై పూజా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.