భారత్‌ వైమానికి దళంలో చేరిన రఫెల్‌

భారత్‌ వైమానికి దళంలో చేరిన రఫెల్‌
Rafales-To-Join-Air-Force

అంబాలా: హరియాణలోని అంబాలా వైమానికి స్థావరంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, మంత్రి ఫ్లొరెన్స్‌ పార్లె నేతృత్వంలో మొదటి బ్యాచ్‌కు చెందిన ఐదు రఫెల్‌ యుద్ధ విమనాలను అధికారిగా వైమానికి దళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్భంగా స‌ర్వ‌ధ‌ర్మ పూజ నిర్వ‌హించారు. స‌ర్వ మ‌తాల‌కు చెందిన పెద్ద‌లు పూజ‌లు చేశారు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఫ్రాన్స్ ర‌క్ష‌ణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. స‌ర్వ‌ధ‌ర్మ పూజ త‌ర్వాత ఎయిర్‌షో నిర్వ‌హించారు. తొలుత రాఫేల్ విమానం చుట్టూ సుఖోయ్‌30, జాగ్వార్ విమానాలు గాలిలో ఎగురుతూ వంద‌నం చేశాయి. అత్య‌ద్భుతంగా ఎయిర్‌ఫో నిర్వ‌హించారు. తేజ‌స్ యుద్ధ విమానాలు కూడా రాఫేల్‌కు స్వాగ‌తం ప‌లికాయి. గోల్డెన్ యారోస్ స్క్వాడ్ర‌న్‌లో చేరిన రాఫేల్స్‌కు వాట‌ర్ కెనాన్‌ సెల్యూట్ కూడా నిర్వ‌హించారు. దీంతో భార‌త వాయుసేన‌లో కొత్త అధ్యాయం మొద‌లైంది. 36 రాఫెల్స్ కోసం 59వేల కోట్ల ఒప్పందం జరిగింది. తొలుత 5 రాఫేల్స్ వ‌చ్చాయి. వ‌చ్చే నెల‌లో మ‌రో నాలుగు రాఫెల్ విమానాలు ఇండియాకు రానున్నాయి. .


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/