పసి పిల్లలకు, తల్లీ బిడ్డలకు మోడీ కిట్స్ అందజేత

modi-kits-for-babies-mothers-and-children-in-hyderabad

హైదరాబాద్ః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌ లో పసి పిల్లలకు, తల్లీ బిడ్డలకు మోడీ కిట్స్ అందించారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు పిల్లల పౌష్టిక ఆహారం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని… ఈ రోజు ముషీరాబాద్ లో పసి పిల్లలకు, తల్లీ బిడ్డలకు మోడీ కిట్స్ అందించామని వివరించారు. భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని… ఈ నాటి పిల్లలే రేపటి భారతం కాబట్టి వారంతా ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

పోషకాహార లోపంతో తల్లీబిడ్డలు అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యంగా నిర్మాణం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని….కేంద్రప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తోందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, ఆయుష్మాన్ భారత్ స్కీంలో ఉచిత వైద్యం, ఉచిత టూయిలెట్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తోంది…భవిష్యత్తులో నరేంద్రమోదీ గారి నాయకత్వంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కోసం నూతన కార్యక్రమాలు కూడా చేపడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.