పులివెందుల్లో కూడా జగన్ ను ఓడిస్తాం – బుద్దా వెంకన్న

రాబోయే ఎన్నికల్లో పులివెందులలో కూడా సీఎం జగన్ ను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీ బుద్దా వెంకన్న. రాయలసీమ ప్రజలు జగన్ ను నమ్మడం లేదని… ఈ విషయం ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లి, ఇడుపులపాయ ప్యాలస్ లలో జగన్ దాచుకున్న డబ్బును బయటకు తీస్తామని వెంకన్న చెప్పుకొచ్చారు. తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయి కంటతడి పెడుతుంటే… మంత్రులు మాత్రం హాయిగా బస్సు యాత్రలు చేసుకుంటున్నారని విమర్శించారు. రైతుల బాధలను మంత్రులు వినాలని చెప్పారు. జగన్ తాడేపల్లి ప్యాలస్ లో మెద్దునిద్ర పోతుంటే… రైతు సమస్యలను చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని విమర్శించారు.